700 రోజులకు పైగా పాఠశాలలు మూతపడ్డాయి: తల్లిదండ్రుల ఫిర్యాదు
Schools in Mumbai closed for more than 700 days.. Parental letter to CM. 700 రోజుల పాటు పాఠశాలలు మూసివేయబడటంతో పిల్లలు చాలా నష్టపోయారు.
By అంజి Published on 20 Jan 2022 1:12 PM ISTముంబయిలో పాఠశాలలు తెరవాలని మహారాష్ట్ర ఇంగ్లీష్ స్కూల్ ట్రస్టీస్ అసోసియేషన్‌తో కలిసి 'పేరెంట్ అసోసియేషన్ ఆఫ్ ముంబై 2021' కింద విద్యార్థుల తల్లిదండ్రుల బృందం.. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి, బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాశారు. జనవరి 24వ తేదీ సోమవారంలోగా పాఠశాలలను అత్యవసరంగా పునఃప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. 700 రోజుల పాటు పాఠశాలలు మూసివేయబడటంతో మహారాష్ట్రలోని పిల్లలు చాలా నష్టపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో ఉన్నట్లుగా విద్య అనేది ఒక ముఖ్యమైన సేవగా ఉండాలి. అయితే విద్యకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం పౌరులకు బాధ కలిగించింది అని ముంబై, మహారాష్ట్రలోని పిల్లల తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
పాఠశాల ప్రారంభంపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం మరో పక్షం రోజుల సమయం తీసుకోవాలని నిర్ణయించింది. అయితే, పేరెంట్స్ అసోసియేషన్.. "బార్లు, రెస్టారెంట్లు, మాల్స్, జిమ్‌లు, పిల్లల ఆట స్థలాలు మొదలైనవన్నీ పాఠశాలలు లేని సమయంలో తెరవడానికి ఎందుకు అనుమతిస్తారు? అంటూ ప్రశ్నించింది. బార్‌లు, మద్యం తాగడం లేదా మాల్స్‌కి వెళ్లడం చాలా ముఖ్యమా.. కానీ పిల్లలు 700 రోజులు పాఠశాలకు వెళ్లి చదువుకోవడం అంత ముఖ్యమైనది కాదా?" అంటూ లేఖలో రాశారు. తల్లిదండ్రులు పాఠశాలలను వాణిజ్యేతర ప్రాంతాలని.. స్ప్రెడర్‌లు కాదని చెప్పారు. మాల్స్, రెస్టారెంట్లు, బార్‌ల వంటి ప్రాంతాలను సూపర్ స్ప్రెడర్‌లు అని అన్నారు.
మహారాష్ట్ర పాఠశాలలను పునఃప్రారంభించాలి: అధికారులకు తల్లిదండ్రుల డిమాండ్
జనవరి 24 నుంచి ప్రభుత్వం అన్ని పాఠశాలలు, కళాశాలలను తెరిపించాలని, గత సారిలా కాకుండా అన్ని తరగతులకు అమలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైనప్పుడు సాధారణ పనివేళలు ఉండాలని, పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాల బస్సులు కూడా పనిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు వాస్తవిక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను ఉంచాలని, కాంటాక్ట్ స్పోర్ట్స్ మినహా అన్ని పాఠ్యాంశాలు, పాఠ్యేతర కార్యకలాపాలను అనుమతించాలని కోరారు.