తీవ్రమైన వేడిగాలులు, ఉక్కపోతల కారణంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను వారం రోజుల పాటూ మూసి వేస్తున్నామని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత పిల్లలు తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని బెనర్జీ వివరించారు. ప్రయివేటు విద్యాసంస్థలు కూడా ఈ నిర్ణయాన్ని పాటించాలని సిఎం కోరారు. ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటికి వెళ్లవద్దని ఆమె ప్రజలను కోరారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే వేసవి సెలవులను మూడు వారాల ముందుగానే మార్చింది. రాష్ట్రంలో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఏప్రిల్ 19 వరకు హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.