Viral Video : రోడ్డు దాటుతుండగా ప్ర‌మాదం.. తల్లిని కాపాడుకున్న‌ బాలిక

కర్నాటకలోని ఓ పాఠశాల విద్యార్థిని తన తల్లిని, మరో ప్రయాణికుడిని రక్షించేందుకు బోల్తా పడిన ఆటో రిక్షాను పైకి లేపడం సీసీటీవీలో రికార్డైంది

By Medi Samrat  Published on  9 Sept 2024 7:45 PM IST
Viral Video : రోడ్డు దాటుతుండగా ప్ర‌మాదం.. తల్లిని కాపాడుకున్న‌ బాలిక

కర్నాటకలోని ఓ పాఠశాల విద్యార్థిని తన తల్లిని, మరో ప్రయాణికుడిని రక్షించేందుకు బోల్తా పడిన ఆటో రిక్షాను పైకి లేపడం సీసీటీవీలో రికార్డైంది. మంగళూరు సమీపంలోని కిన్నిగోలిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల చేతన తన కుమార్తెను ట్యూషన్ సెంటర్ నుండి తీసుకురావడానికి రోడ్డు దాటుతుండగా ఆటో వేగంగా వచ్చింది. ఇంతలో చేతనను ఢీకొట్టింది. అంతేకాకుండా చేతన మీద ఆటో రిక్షా బోల్తా పడింది.

ఈ ప్రమాదాన్ని చూసిన ఆమె కుమార్తె, అక్కడికి పరిగెత్తుకుని వచ్చింది. తన తల్లిపై నుండి వాహనాన్ని ఎత్తి, మరొక ప్రయాణీకుడితో పాటు ఆమెను కాపాడింది. తీవ్ర గాయాలపాలైన చేతనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌తో పాటు మరో ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువతి ధైర్యసాహసాలకు ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి.

Next Story