'నా నెలవారీ ఆదాయం ఎంతంటే'.. ఆ బ్యాంకు ఉద్యోగిని జీతం విని అంతా షాక్ అవుతున్నారు..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె సుమారు 2.5 సంవత్సరాలు సేవలందించిందని.. ఈ కాలంలో ఐదు ఇంక్రిమెంట్లు పొందిందని వివరిస్తుంది.

By -  Medi Samrat
Published on : 27 Jan 2026 6:40 PM IST

నా నెలవారీ ఆదాయం ఎంతంటే.. ఆ బ్యాంకు ఉద్యోగిని జీతం విని అంతా షాక్ అవుతున్నారు..!

ఆ బ్యాంకు ఉద్యోగిని జీతం విని అంతా షాక్ అవుతున్నారు..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె సుమారు 2.5 సంవత్సరాలు సేవలందించిందని.. ఈ కాలంలో ఐదు ఇంక్రిమెంట్లు పొందిందని వివరిస్తుంది. ఆమె జీతం ఇప్పుడు 95,000 రూపాయలకు చేరుకుందని పేర్కొంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు ఆ మహిళను ప్రశంసించారు. బ్యాంకింగ్ మరియు జీతాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యాయి.

ఆ మహిళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. 2022లో తాను IBPS ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్షలో ఉత్తీర్ణురాలిన‌య్యానని వివరిస్తూ.. ఆ మహిళ తాను గత 2.5 సంవత్సరాలుగా SBIలో POగా పనిచేస్తున్నానని చెప్పింది. ఆమె నెలకు 95,000 రూపాయల జీతం సంపాదిస్తుంది. అలాగే అనేక ఇతర ప్రయోజనాలను పొందుతుంది. ఆమె చెప్పిన‌ ప్రకారం.. త‌ను లీజు అద్దెగా ₹18,500, ఇతర భత్యాలుగా ₹11,000 పొందుదుంతి. దీంతో ఆమె మొత్తం సంపాదన ₹1 లక్షకు పైగా ఉంటుంది.

ఆ మహిళ జూనియర్ అసోసియేట్ ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ మరియు సర్టిఫైడ్ అసోసియేట్ ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ వంటి ప్రొఫెషనల్ బ్యాంకింగ్ సర్టిఫికేషన్లను కూడా ప్రస్తావించింది. ఈ పరీక్షల‌లో ఉత్తీర్ణత సాధించిన ఉద్యోగులకు అనేక బ్యాంకులు అదనపు జీతాల పెంపుదల ఇస్తాయని ఆమె అన్నారు. వినియోగదారులు వీడియో చూసి స్పందించారు. ఒకరు "ఇది నాకు ప్రేరణను పెంచింది" అని అన్నారు. మరొకరు "నా స్నేహితుడు ఒక PO, కానీ అతనికి జీతం అంత ఎక్కువ కాదని అంటున్నాడు" అని అన్నారు. మరొక వినియోగదారు.. మీరు చాలా కష్టపడ్డారని, ముందుకు సాగాలని రాశారు.

Next Story