అత‌డే దోషి.. కోల్‌కతా డాక్టర్‌‌ అత్యాచారం, హత్య కేసు తీర్పు వెలువ‌రించిన‌ కోర్టు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్ రాయ్ దోషిగా తేలింది.

By Medi Samrat  Published on  18 Jan 2025 2:49 PM IST
అత‌డే దోషి.. కోల్‌కతా డాక్టర్‌‌ అత్యాచారం, హత్య కేసు తీర్పు వెలువ‌రించిన‌ కోర్టు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్ రాయ్ దోషిగా తేలింది. సీల్దా ప్రత్యేక కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ కోర్టులో విచారణ ప్రారంభమైన 57 రోజుల తర్వాత తీర్పు వెలువరించారు. ఈ కేసు విచారణ నవంబర్ 11న ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసింది.

గత ఏడాది ఆగస్టు 9వ తేదీన ఆర్‌జి కర్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగం నాలుగో అంతస్తులోని సెమినార్ హాల్‌లో బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు, పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ను సంఘటన జరిగిన మరుసటి రోజు అరెస్టు చేశారు. ఈ కేసుపై దేశవ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

Next Story