సనాతన ధర్మం డెంగ్యూ లాంటిది, దానిని నిర్మూలించాల్సిందే: ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మం.. దోమలు, డెంగ్యూ, మలేరియా లాంటిదని, దానిని నిర్మూలించాల్సిందేనని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
By అంజి Published on 3 Sept 2023 9:15 AM ISTసనాతన ధర్మం డెంగ్యూ లాంటిది, దానిని నిర్మూలించాల్సిందే: ఉధయనిధి స్టాలిన్
సనాతన ధర్మం.. దోమలు, డెంగ్యూ, మలేరియా లాంటిదని, దానిని నిర్మూలించాల్సిందేనని తమిళనాడు క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ ఫోరం నిర్వహించిన సనాతనం (సనాతన ధర్మ) నిర్మూలన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉదయనిధి తన ప్రసంగంలో ఇలా అన్నారు.. ''సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు ఈ సదస్సులో మాట్లాడే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు. ఈ సదస్సును 'సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం' అనే బదులు 'సంతాన ధర్మ నిర్మూలన'గా పేర్కొన్నందుకు నిర్వాహకులను అభినందిస్తున్నాను''
“మనం నిర్మూలించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. మనం వాటిని కేవలం వ్యతిరేకించలేము. దోమలు, డెంగ్యూ, కరోనా, మలేరియా వంటివి మనం వ్యతిరేకించలేనివి, వాటిని మనం నిర్మూలించాలి. సనాతనం కూడా ఇలాగే ఉంటుంది. సనాతనాన్ని నిర్మూలించడం, వ్యతిరేకించకపోవడం మన ముందున్న కర్తవ్యం” అని అన్నారు. సనాతన ధర్మం.. సమానత్వం, సామాజిక న్యాయం రెండింటికీ వ్యతిరేకమని డీఎంకే యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కూడా అయిన క్రీడా మంత్రి ఉధయనిధి స్టాలిన్ అన్నారు. సనాతనం అంటే ఏమిటి? శాశ్వతమైనది లేదా మార్చలేనిది, ప్రశ్నించలేనిది, అది సనాతనం యొక్క అర్థమని అన్నారు.
సనాతనం సంస్థ ప్రజలను కులాల వారీగా విభజించి విడదీసేదని సినీ నటుడు, నిర్మాత కూడా అయిన యువ నాయకుడు అన్నారు. "అయితే, మా కలైంజర్ (కరుణానిధి) ప్రతి వర్గాన్ని ఒక గ్రామంలోకి తీసుకువచ్చి దానికి సమతువపురం (సమానత గ్రామం) అని పేరు పెట్టారు" అని ఆయన అన్నారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనపై తమిళనాడు భాజపా అధ్యక్షుడు కె. అన్నామలై ప్రశ్నించారు. డిఎంకె ప్రముఖ సభ్యుడిగా ఉన్న ప్రతిపక్ష భారత కూటమి ముంబై సమావేశంలో ఇది అంగీకరించబడిందా అని ఆయన అడిగారు.