శామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యలపై దుమారం.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్‌ పదవికి రాజీనామా

కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుండి వైదొలిగారు. అతని రాజీనామాను పార్టీ ఆమోదించింది.

By అంజి  Published on  8 May 2024 3:05 PM GMT
Sam Pitroda , Indian Overseas Congress chief, Congress, india

శామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యలపై దుమారం.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్‌ పదవికి రాజీనామా

కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుండి వైదొలిగారు. అతని రాజీనామాను పార్టీ ఆమోదించింది. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. శామ్ పిట్రోడా "వ్యక్తిగత కారణాల" కారణంగా ఈ కీలక పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని ప్రకటించారు. తూర్పు ప్రాంతంలోని భారతీయులు చైనీయులను పోలి ఉంటారని, అయితే దక్షిణాదిలో ఉన్నవారు ఆఫ్రికన్‌లుగా కనిపిస్తారని పిట్రోడా చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై దుమారం రేగుతోంది.

భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. "మేము భారతదేశం వలె విభిన్నమైన దేశాన్ని కలిపి ఉంచగలము. తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా కనిపిస్తారు, పశ్చిమాన ఉన్నవారు అరబ్‌లా కనిపిస్తారు, ఉత్తరాన ఉన్నవారు తెల్లగా కనిపిస్తారు. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్‌లలా కనిపిస్తారు" అని పిట్రోడా ది స్టేట్స్‌మన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ నేతలతో సహా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

పిట్రోడా వ్యాఖ్యలకు కాంగ్రెస్ వెంటనే దూరంగా ఉండి, వాటిని "ఆమోదయోగ్యం కాదు" అని పేర్కొంది. "భారతదేశం యొక్క వైవిధ్యాన్ని వివరించడానికి మిస్టర్ సామ్ పిట్రోడా పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం, ఆమోదయోగ్యం కాదు. ఈ వ్యాఖ్యలతో భారత జాతీయ కాంగ్రెస్ ఎలాంటి సంబంధం లేదు" అని జైరామ్ రమేష్ ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. పిట్రోడా వ్యాఖ్యలపై బిజెపి కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. వాటిని "జాత్యహంకార, విభజన" అని పేర్కొంది.

Next Story