శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసు.. ఉన్నికృష్ణన్‌కు బెయిల్

కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

By -  Medi Samrat
Published on : 5 Feb 2026 5:07 PM IST

శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసు.. ఉన్నికృష్ణన్‌కు బెయిల్

కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతని అరెస్టు జరిగిన 90 రోజులలోపు ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమవడంతో ఈ బెయిల్ లభించింది.

శబరిమల గర్భగుడి తలుపుల ఫ్రేముల నుండి బంగారం అదృశ్యం కావడానికి సంబంధించిన రెండో కేసులో ఉన్నికృష్ణన్‌ పొట్టికి బెయిల్ మంజూరైంది. ద్వారపాలక విగ్రహం కేసులో కూడా అతనికి బెయిల్ లభించింది. కొల్లాంలోని విజిలెన్స్ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

బెయిల్ షరతులలో భాగంగా పొట్టి ఒక్కొక్కటి రూ. 2 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలి. కేరళ విడిచి వెళ్లకూడదు. శబరిమల ఆలయం ఉన్న పతనంతిట్ట జిల్లాలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. ప్రతి మంగళవారం, శుక్రవారం దర్యాప్తు అధికారులకు రిపోర్ట్ చేయాలి.

Next Story