నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. రేపటి నుండే భక్తులకు అనుమతి.!

Sabarimala ayyappa temple to open today. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోనంది. తులా మాసం పూజల కోసం శబరిమల

By అంజి  Published on  16 Oct 2021 3:21 AM GMT
నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. రేపటి నుండే భక్తులకు అనుమతి.!

  • సా.5 గంటలకు అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్న ట్రావెన్ కోర్ సిబ్బంది
  • రేపటి నుంచి 21వ తేదీ వరకు ఆలయంలోకి భక్తులకు అనుమతి
  • రేపు డ్రా పద్ధతిలో శబరిమల ఆలయ ప్రధాన పూజారి ఎంపిక

నేడు కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోనంది. తులా మాసం పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని ట్రావెన్‌ కోర్ బోర్డు సిబ్బంది తెరవనున్నారు. సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప ఆలయాన్ని తెరచి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే రేపు డ్రా పద్ధతిలో శబరిమల అయ్యప్ప ఆలయ పూజారిని ఎన్నుకోనున్నారు. ఇకపోతే రేపటి నుండి భక్తులకు ఆలయంలోకి అనుమతి ఉంటుందని ట్రావెన్ కోర్ బోర్డు తెలిపింది.

ఆలయాన్ని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా వర్చువల్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పూరైన సర్టిఫికెట్ లేదా 72 గంటల్లో తీసుకున్న కరోనా నెగిటివ్‌ రిపోర్టును ఆలయ సిబ్బందికి చూపిస్తేనే అనుమతిస్తారు. అక్టోబర్‌ 21వ తేదీ తర్వాత అయ్యప్ప ఆలయాన్ని మూసివేసి.. మళ్లీ నవంబర్ 2వ తేదీన తెరవనున్నారు. ఆ తర్వాత రోజే ఆలయాన్ని మూసివేసి.. తిరిగి మకరవిలాక్కు పండగ సందర్భంగా నవంబర్ 15న ఆలయాన్ని మళ్లీ తెరవనున్నట్లు ట్రావెన్‌ కోర్ బోర్డు తెలిపింది.

Next Story
Share it