రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం భారతదేశ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర 111 డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ముడి చమురు ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంక్షోభం తర్వాత గ్లోబల్ చమురు ధరలు బ్యారెల్ (159 లీటర్లు) మార్కును 100 డాలర్లు (రూ. 7,527) దాటిపోయాయి. రెండు దేశాల మధ్య పరిస్థితి తీవ్రతరం కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఇంధన రేట్లు మరింత పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్‌లోని సెంటర్ ఆన్ గ్లోబల్ ఎనర్జీ పాలసీలో సీనియర్ రీసెర్చ్ స్కాలర్ కౌశిక్ దేబ్ మాట్లాడుతూ.. "గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పటికే 2021 మధ్యకాలం నుండి పెంచబడ్డాయి. ఈ సంవత్సరం చాలా వరకు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. అయితే భారత్‌లో ఇంకా ధరల పెరుగుదల కనిపించలేదు. దీనికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలే కారణం కావచ్చు. "ఈ సమయంలో ఇంధన ధరల ద్రవ్యోల్బణం సమస్యను తీసుకురావాలని ప్రభుత్వం కోరుకోవడం లేదు" అని నిపుణుడు చెప్పారు.
న్యూఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.95.41, లీటర్ రూ.86.67గా ఉంది. క్రూడాయిల్ ధరలు 10 శాతం పెరగడం వల్ల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.8-9 వరకు పెరగవచ్చని అంచనా. భారతదేశం తన ముడి చమురులో కేవలం రెండు శాతం మాత్రమే రష్యా నుండి దిగుమతి చేసుకుంటుంది. తద్వారా సరఫరా అంతరాయానికి తక్కువ అవకాశం ఉంది. అయితే, ప్రపంచ ధరల పెరుగుదలకు దేశం సున్నితంగా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీనివల్ల అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా దెబ్బతింటుంది, ధరలు పెరుగుతాయని తెలుస్తోంది.