RTPCR negative report or vaccination certificate mandatory to enter Karnataka from Maharashtra. కరోనా కట్టడికి రాష్ట్రాలు
By Medi Samrat Published on 30 Jun 2021 7:57 AM GMT
కరోనా కట్టడికి రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో ఓ రూపంలో మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. ఈ నేఫథ్యంలో మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతుండడంతో.. పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం మహరాష్ట్ర నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించింది. కరోనా నెగెటివ్ రిపోర్ట్ లేదా కనీసం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిన వారినే రాష్ట్రంలోకి అనుమతించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు కర్ణాటక చీఫ్ సెక్రటరీ రవి కుమార్ మాట్లాడుతూ.. బస్సు, ట్రైన్, ఫ్లైట్.. ఏ మార్గంలో వచ్చినా ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొన్నారు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ తీసుకున్న 72 గంటలలోనే అనుమతి ఉంటుందని ఉత్తర్వులలో తెలిపారు. ఇక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ పదవులలో ఉన్న వారు, హెల్త్ వర్కర్స్, రెండేండ్లలోపు వయసున్న పిల్లలకు దీనినుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే కుటుంబసభ్యుల అంత్యక్రియలకు వెళ్లేవారిని, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్లను చెక్ పోస్టుల్లో ఆపవద్దని సూచించారు. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో డెల్టా ప్లస్ కేసులు వస్తున్న నేపథ్యంలో సరిహద్దు జిల్లాలైన కలబుర్గి, బెలగావి, విజయపుర, బీదర్ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.