ఆ 6,266 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో.?

అధికారిక సమాచారం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ 2000 రూపాయల కరెన్సీని ఉపసంహరించుకున్న రెండు సంవత్సరాల తరువాత కూడా రూ.6,266 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇప్పటికీ చెలామణిలోనే ఉన్నాయి.

By Medi Samrat
Published on : 2 May 2025 5:50 PM IST

ఆ 6,266 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో.?

అధికారిక సమాచారం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ 2000 రూపాయల కరెన్సీని ఉపసంహరించుకున్న రెండు సంవత్సరాల తరువాత కూడా రూ.6,266 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇప్పటికీ చెలామణిలోనే ఉన్నాయి. మే 19, 2023న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2000 డినామినేషన్ నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

శుక్రవారం RBI విడుదల చేసిన ప్రకటనలో చెలామణీలో ఉన్న 2000 రూపాయల నోట్ల విలువ మే 19, 2023 నాటికి రూ. 3.56 లక్షల కోట్లుగా ఉండగా, ఏప్రిల్ 30, 2025న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 6,266 కోట్లకు తగ్గింది. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 98.24 శాతం తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంకు తెలిపింది.

అక్టోబర్ 9, 2023 నుండి, RBI అనుమతులు ఉన్న కార్యాలయాలు వ్యక్తులు, సంస్థల నుండి వారి బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేయడానికి రూ. 2000 నోట్లను అంగీకరిస్తున్నాయి. ప్రజలు తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి దేశంలోని ఏ పోస్టాఫీసు నుండి అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇండియా పోస్ట్ ద్వారా రూ. 2000 నోట్లను పంపవచ్చు.

Next Story