అసోం సర్కారు బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలకు హాజరయ్యే బాలికలకు రోజూ రూ.100 చొప్పున అందజేయనుంది. ఈ విషయమై అసోం విద్యాశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ వివరాలను తెలిపారు. అలాగే.. 'ప్రజ్ఞాన్ భారతి' పథకం కింద రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన బాలికలకు ద్విచక్రవాహనాలను కూడా అందజేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అంతేకాకుండా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినుల స్టడీ మెటీరియల్ ఖర్చులకై రూ.1500, రూ.2000 చొప్పున వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి వెల్లడించారు.