పెరిగిన ఇంధన ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశరు. ఈ రోజు ఢిల్లీలో సైకిల్‌పై ప్రయాణించి.. ప్రజలు ఎలా బాధపడుతున్నారో.. ఏసీ కార్ల నుండి బయటకు వచ్చి చూడాలని.. అప్పుడైనా ఇంధన ధరలను తగ్గిస్తారని ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ప్రధాని కేవలం ఇతరులను( గత ప్రభుత్వాలను) నిందిస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు.
వాద్రా.. సూట్, హెల్మెట్ ధరించి సైకిల్‌పై నగరంలోని ఖాన్ మార్కెట్ ప్రాంతం నుండి తన కార్యాలయానికి బయలుదేరారు. ఈ మేరకు ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్ఐ ట్వీట్ చేసింది. ఇదిలావుంటే.. ఇంధన ధరల పెంపుపై రాహుల్ గాంధీ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెట్రోల్ లీటరుకు ₹ 100 ఉంది. మీ జేబులను ఖాళీ చేసి.. తన స్నేహితుల జేబులను నింపే గొప్ప పనిని మోడీ ప్రభుత్వం చేస్తోందని రాహుల్ ట్వీట్ చేశారు.