రోడ్లను ప్రియాంక గాంధీ చెంపల వలె.. స్మూత్‌గా మారుస్తా: బీజేపీ అభ్యర్థి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చెంపల్లా.. నియోజకవర్గంలోని రోడ్లను సున్నితంగా చేస్తానని బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వివాదంగా మారాయి.

By అంజి  Published on  5 Jan 2025 4:05 PM IST
Roads, Priyanka Gandhi cheeks, BJP leader, Congress, Delhi

రోడ్లను ప్రియాంక గాంధీ చెంపల వలె.. స్మూత్‌గా మారుస్తా: బీజేపీ అభ్యర్థి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చెంపల్లా.. నియోజకవర్గంలోని రోడ్లను సున్నితంగా చేస్తానని బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వివాదంగా మారాయి. ఢిల్లీలోని కల్కాజీ నుంచి రమేష్‌ బిధురి పోటీ చేస్తున్నారు. ఆదివారం నాడు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంలో పడేలా చేశాయి. బిజెపిని "మహిళా వ్యతిరేక పార్టీ"గా అభివర్ణించిన కాంగ్రెస్, బిధూరి వ్యాఖ్యలు "సిగ్గుచేటు" అని, "ఇది అతని వికారమైన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని" నిందించింది. "ఇది బిజెపి అసలు ముఖం. పార్టీ అగ్రనాయకత్వం ముకుళిత హస్తాలతో ప్రియాంక గాంధీని క్షమించాలని కోరాలి" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే అన్నారు.

బిధురి తాను ఈ వ్యాఖ్యలు చేశానని ధృవీకరించారు, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రోడ్లను నటుడు-రాజకీయవేత్త హేమా మాలిని చెంపల వలె స్మూత్‌గా మారుస్తానని ఒకసారి చెప్పారని ఎత్తి చూపారు. ''ఈరోజు వారు (కాంగ్రెస్) ఈ ప్రకటనతో బాధ పడుతుంటే, హేమ మాలిని ఏమంటారు? ఆమె పేరు పొందిన కథానాయిక, సినిమాల ద్వారా భారతదేశానికి కీర్తి తెచ్చారని.. లాలూ యాదవ్‌ను అతని వ్యాఖ్యలకు కార్నర్ చేయకపోతే, వారు నా వ్యాఖ్యలపైనా ఎలా ప్రశ్నిస్తారు" అని ఎదురుదాడి చేశాడు.

కాంగ్రెస్ దాడిపై బిధురి స్పందిస్తూ.. "హేమ మాలిని మహిళ కాదా? జీవితంలో సాధించిన విజయాల విషయంలో ప్రియాంక గాంధీ కంటే హేమ మాలిని చాలా ఉన్నతమైనది" అని అన్నారు.

బిజెపి నాయకుడిపై దాడిని తీవ్రతరం చేస్తూ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్పియా శ్రీనాట్ ఇంకా మాట్లాడుతూ, "తమ మాజీ ఎం;w, ఇప్పుడు కల్కాజీ స్థానం నుండి అభ్యర్థి అయిన రమేష్ బిధూరి ప్రియాంక గాంధీ వాద్రా గురించి మాట్లాడినది అతని మనస్తత్వాన్ని, బిజెపి స్వభావాన్ని చూపుతోంది" అని అన్నారు.

అదే సమయంలో, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా బిధురిపై విరుచుకుపడ్డారు. మహిళల పట్ల బిజెపికి ఉన్న గౌరవాన్ని ప్రశ్నించారు. "ఇది బీజేపీ అభ్యర్థి, అతని భాష వినండి, ఇది మహిళల పట్ల బిజెపికి ఉన్న గౌరవం. ఢిల్లీ మహిళల గౌరవం ఇలాంటి నాయకుల చేతుల్లో భద్రంగా ఉందా?" అని హిందీలో చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story