ఊహించని హిమపాతం, విరిగిపడ్డ మంచు చరియల కింద 47 మంది కార్మికులు

ఉత్తరాఖండ్‌లో ఊహించని ప్రమాదం సంభవించింది.

By Knakam Karthik  Published on  28 Feb 2025 3:14 PM IST
National News, Uttarakhand, Badrinath-Landslide, Road-Workers

ఊహించని హిమపాతం, విరిగిపడ్డ మంచు చరియల కింద 47 మంది కార్మికులు

ఉత్తరాఖండ్‌లో ఊహించని ప్రమాదం సంభవించింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో శుక్రవారం ఉదయం మంచు చరియలు విరిగిపడ్డాయి. కార్మికులు రహదారి పనులు చేస్తుండగా, ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. వాటి కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటన బద్రీనాథ్, ధామ్‌లోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

బద్రీనాథ్‌కు సమీపంలో ఉన్న మనా గ్రామంలోని బీఆర్‌ఓ క్యాంపునకు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 57 మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకుపోయినట్లు తెలిపారు. కాగా ఇందులో 10 మందిని రక్షించి క్యాంప్‌కు తరలించారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంచు దట్టంగా కురుస్తుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వెల్లడించారు.

Next Story