ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు సజీవ దహనం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 1:10 PM ISTఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు సజీవ దహనం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. దాంతో.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడం వల్ల ఒక్కసారిగా ఆయా వాహనాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న ముగ్గురు సజీవ దహనం అయ్యారు. అంతేకాదు.. ప్రమాదంలో ట్రక్కుతో పాటు మరో ఐదు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి.
మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లా ఆగ్రా-ముంబై జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దాంతో.. డ్రైవర్ ట్రక్కును అదుపు చేయలేకపోయాడు. దాంతో.. ముందున్న ఐదు వాహనాలపైకి దూసుకెళ్లింది ట్రక్కు. వేగంగా ఢీకొట్టడం వల్ల మంటలు చెలరేగాయి. దాంతో.. ట్రక్కుతో పాటు మరో ఐదు వాహనాలు దగ్ధం అయ్యాయి. మంటల్లో ఇరుక్కుని ముగ్గురు సజీవ దహనం అయ్యారు. అంతేకాదు..ఈ రోడ్డు ప్రమాదంలో మరికొందరికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.
ఇక ఈ ప్రమాదం గమనించిన జాతీయ రహదారిపై వెళ్తున్న ఇతర వాహనదారులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఫైరింజన్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి వచ్చినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటలను పూర్తిగా ఆర్పేసిన తర్వాత సహాయక చర్యలు చేశారు ఫైర్ సిబ్బంది, పోలీసులు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆగ్రా-ముంబై రహదారిపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. కాలిపోయిన వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని.. మృతులను గుర్తించే పనిలో పడ్డామని పోలీసులు వెల్లడించారు.