543 నియోజకవర్గాలలో వెలువ‌డిన‌ ఫలితాలు.. ఒక్క స్థానం మాత్రం..

543 లోక్‌సభ స్థానాలకు గాను 542 స్థానాలకు ఫలితాలు ప్రకటించగా.. బీజేపీ 240 స్థానాలు, కాంగ్రెస్ 99 స్థానాలు గెలుచుకున్నాయి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jun 2024 4:20 AM GMT
results,  lok sabha constituencies,  bjp, congress,

543 నియోజకవర్గాలలో వెలువ‌డిన‌ ఫలితాలు.. ఒక్క స్థానం మాత్రం..

భారత ఎన్నికల సంఘం 543 లోక్‌సభ స్థానాలకు గాను 542 స్థానాలకు ఫలితాలు ప్రకటించగా.. బీజేపీ 240 స్థానాలు, కాంగ్రెస్ 99 స్థానాలు గెలుచుకున్నాయి. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం.. బీజేపీకి చెందిన పంకజా ముండేపై ఎన్‌సిపి (శరద్ పవార్) అభ్యర్థి బజరంగ్ మనోహర్ సోన్వానే ముందంజలో ఉన్నారు.. ఫ‌లితం ఇంకా వెలువ‌డాల్సి వుంది. లోక్‌సభలో 543 మంది సభ్యులు ఉండగా.. బీజేపీ సూరత్ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత 542 స్థానాలకు కౌంటింగ్ నిర్వహించారు.

బుధవారం తెల్లవారుజాము నాటికి ప్రకటించిన ఫలితాల ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) స్ప‌ష్ట‌మైన‌ మెజారిటీతో వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. బీజేపీ అభ్య‌ర్ధులు 240 స్థానాలతో మాత్ర‌మే గెలిచి.. 272 మెజారిటీ మార్కుకు కాస్తా వెనుక‌బ‌డింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ నేతృత్వంలోని ఎన్‌డిఎలోని మిత్రపక్షాల మద్దతు అవసరం. ఆంధ్రప్రదేశ్‌, బీహార్ వరుసగా టీడీపీ 16, జేడీయూ 12 స్థానాలు, జ‌న‌సేన 2 స్థానాలు గెలుచుకోవ‌డంతో పాటు ఎన్‌డిఎలోని ఇత‌ర పార్టీల స‌హ‌కారంతో మూడోసారి ఎన్‌డిఎ ప్ర‌భుత్వ ఏర్పాటు ఖాయమ‌వుతుంది.

ప్రతిపక్ష భారత కూటమిలో భాగమైన కాంగ్రెస్.. 2019లో గెలిచిన 52 సీట్లతో పోలిస్తే కాస్తా మెరుగైన ఫ‌లితాల‌తో 99 సీట్లు గెలుచుకుంది.. రాజస్థాన్, హర్యానాలో BJP కి కాంగ్రెస్ షాకిచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పశ్చిమ బెంగాల్‌లో 29 సీట్లు గెలుచుకుని కూట‌మిలో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీల‌లో రెండు, మూడు స్థానాల‌లో ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు 12 సీట్లు గెలుచుకుంది. ఎగ్జిట్ పోల్‌లు అంచనాల‌పై ధీమాగా ఉన్న‌ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో నిర్వహించిన లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో 640 మిలియన్లకు పైగా ఓట్లు లెక్కించబడ్డాయి.

2024 సార్వత్రిక ఎన్నికల్లో వివిధ‌ పార్టీలకు వచ్చిన సీట్లు:

భారతీయ జనతా పార్టీ – BJP 240

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – INC 99

సమాజ్‌వాది పార్టీ – SP 37

ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ – AITC 29

ద్రవిడ మున్నేట్ర కజగం – DMK 22

తెలుగు దేశం – TDP 16

జనతా దళ్ (యునైటెడ్) – JD(U) 12

శివసేన (ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే) – SHSUBT 9

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్‌చంద్ర పవార్ – NCPSP 8

శివసేన – SHS 7

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) – LJPRV 5

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ – YSRCP 4

రాష్ట్రీయ జనతా దళ్ – RJD 4

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) – CPI(M) 4

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ – IUML 3

ఆమ్ ఆద్మీ పార్టీ – AAAP 3

జార్ఖండ్ ముక్తి మోర్చా – JMM 3

జనసేన పార్టీ – JnP 2

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (లిబరేషన్) – CPI(ML)(L) 2

జనతా దళ్ (సెక్యులర్) – JD(S) 2

విడుతలై చిరుతైగల్ కాచ్చి – VCK 2

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – CPI 2

రాష్ట్రీయ లోక్ దళ్ – RLD 2

జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ – JKN 2

యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్ – UPPL 1

అసోం గణ పరిషత్ – AGP 1

హిందుస్థానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) – HAMS 1

కేరళ కాంగ్రెస్ – KEC 1

రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ – RSP 1

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – NCP 1

వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీ – VOTPP 1

జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ – ZPM 1

శిరోమణి అకాళి దళ్ – SAD 1

రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ – RLTP 1

భారత్ ఆదివాసి పార్టీ – BHRTADVSIP 1

సిక్కిం క్రాంతికారి మోర్చా – SKM 1

మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం – MDMK 1

ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) – ASPKR 1

అప్నా దళ్ (సోనెలాల్) – ADAL 1

AJSU పార్టీ – AJSUP 1

ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహదుల్ ముస్లిమీన్ – AIMIM 1

స్వతంత్రులు – IND ౭

Next Story