ఢిల్లీలో ఘనంగా.. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Republic Day Celebrations 26, Jan 2022. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ..

By అంజి  Published on  26 Jan 2022 12:09 PM IST
ఢిల్లీలో ఘనంగా.. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ.. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఆ తర్వాత విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు అందించారు. అనంతరం రాజ్‌పథ్‌లో గణతంత్ర పరేడ్‌ ప్రారంభం అయ్యింది. దేశ సైనిక శక్తిని చాటి చెప్పేలా పరేడ్‌ను, సాంస్కృతిక వైవిద్యాన్ని ప్రదర్శించారు. శకటాల ప్రదర్శన, వాయుసేన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతోంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 155 హెలికాప్టర్‌ యూనిట్‌కు చెందిన నాలుగు ఎమ్‌ఐ-17వీ5 హెలికాప్టర్లు ఆకాశంలో విన్యాసాలు చేశాయి.

జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ ఏఎస్‌ఐ బాబురామ్‌కు అశోక్‌ చక్ర పురస్కారం వరించింది. ఈ పురస్కారాన్నిఆయన మరణాంతరం ప్రకటించారు. బాబురామ్‌ కుటుంబ సభ్యులు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. 2020 ఆగస్టులో ముగ్గురు ఉగ్రవాదులను ఏఎస్‌ఐ బాబురామ్‌ హతమార్చారు.గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లకు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఇండియా గేట్‌ దగ్గర్లోని జాతీయ యుద్ధ స్మారకాన్ని మోడీ సందర్శించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు వందనం చేశారు. ఆ తర్వాత స్మారకం దగ్గర ఉన్న సందర్శకుల పుస్తకంలో సంతం చేశారు. అక్కడి నుండి రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. రాజ్‌పథ్‌లో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జస్టిస్‌ ఎన్వీరమణ దంపతులు, కేంద్రమంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.



Next Story