మోదీ ఫోటోలను తొలగించండి.. కేంద్ర ఆరోగ్య శాఖకు ఈసీ ఆదేశం

Remove PM Modi's picture from vaccine certificates, follow poll code: EC to centre. కరోనా వ్యాక్సిన్‌ సర్టిఫికేట్ల నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఫోటోను వెంటనే తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది

By Medi Samrat
Published on : 6 March 2021 11:11 AM IST

Remove PM Modis picture from vaccine certificates, follow poll code: EC to centre.

కరోనా వ్యాక్సిన్‌ సర్టిఫికేట్ల నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఫోటోను వెంటనే తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనా టీకా ధృవీకరణ పత్రం వారికి ఇస్తున్నారు. ఈ పత్రాలపై ప్రధాని మోదీ ఫోటో ఉంటుంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున మోదీ ఫోటోను తొలగించాలని కేంద్ర మంత్రిత్వ శాఖను ఎన్నికల సంఘం లేఖ రాసింది.

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఇచ్చే ధృవీకరణ పత్రంపై మోదీ ఫోటో ఉండటం ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘన కిందకే వస్తుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. ఈ నిర్ణయాన్ని తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, కొన్ని రోజుల కిందట కూడా ఎన్నికల సంఘం ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. పెట్రోల్‌ బంకుల్లో ప్రధాన నరేంద్ర మోదీ ఫోటోలతో ఉన్న కేంద్ర పథకాల హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఈ హోర్డింగ్‌లను తొలగించేందుకు పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలకు ఈసీ 72 గంటల సమయం ఇచ్చింది. అప్పుడు కూడా తృణమూల్, కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పెట్రో బంకుల్లో ప్రధాని మోదీ ఫొటోలు ఉండటం వల్ల ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని వారు పేర్కొన్నారు. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.




Next Story