రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదు..!

Remdesivir production ramped up ten times. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లకు కొద్ది రోజుల కిందట భారీగా డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే..!

By M.S.R  Published on  29 May 2021 9:41 AM GMT
రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదు..!

రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లకు కొద్ది రోజుల కిందట భారీగా డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే..! ప్రస్తుతం పరిస్థితుల్లో భారీ మార్పు వచ్చిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దేశంలో డిమాండ్ ను మించిపోయేలా రెమ్ డెసివిర్ ఉత్పత్తి జరుగుతోందని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సూఖ్ మాండవ్య వివరణ ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 11 నాటికి దేశంలో రోజుకు 33 వేల రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు ఉత్పత్తి చేయగా, ఇప్పుడది పదింతలు పెరిగి రోజుకు 3.5 లక్షల ఇంజెక్షన్లు తయారుచేసే స్థాయికి చేరిందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక్క నెలలోనే రెమ్ డెసివిర్ ఉత్పత్తి కేంద్రాల సంఖ్యను 20 నుంచి 60కి పెంచిందని.. ప్రస్తుతం డిమాండ్ కంటే లభ్యత ఎక్కువగా ఉన్నందున రాష్ట్రాలకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కేటాయింపులను కేంద్రం నిలిపివేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల లభ్యత, ఇతర అంశాలను జాతీయ ఫార్మా ధరల నియంత్రణ సంస్థ, సీడీఎస్ సీఓ పర్యవేక్షించాలని అన్నారు. కేంద్రం తన వద్ద 50 లక్షల వయల్స్ ను నిల్వ ఉంచుకుంది.




Next Story