జియో.. ఎందుకిలా..?
Reliance Jio faces outage in Mumbai circle. రిలయన్స్ జియో నెట్‌వర్క్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ముంబై టెలికాం సర్కిల్
By Medi Samrat Published on 5 Feb 2022 6:38 PM ISTరిలయన్స్ జియో నెట్‌వర్క్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ముంబై టెలికాం సర్కిల్ పరిధిలో నెట్‌వర్క్‌కు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. దీంతో కాల్స్ ఇన్‌కమ్, అవుట్‌గోయింగ్‌కు ఇబ్బంది పడుతున్నారు యూజర్లు. ముంబైతో పాటు దేశంలోని మరికొన్ని సర్కిల్స్‌లోనూ ఇదే తరహా సమస్యలు యూజర్లు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. నాలుగైదు రోజుల నుంచి నెట్‌వర్క్ సరిగా పని చేయడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జియో నుంచి మాత్రమే కాదు, ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియో నెంబర్లకు కాల్స్ కనెక్ట్ కావడం లేదనే ఫిర్యాదు అందాయి.
అంతరాయానికి కారణం ఏంటన్నది స్పష్టం చేయలేదు జియో సంస్థ. యూజర్లకు వీలైనంత త్వరగా సేవలు పునరుద్ధరిస్తామని పేర్కొంది. అంతవరకు ప్రత్యామ్నాయ సిమ్ లేదంటే ఇంటర్నెట్ బేస్డ్ సేవల్ని వినియోగించుకోవాలని యూజర్లకు విజ‍్క్షప్తి చేస్తోంది. ట్విట్టర్‌లోని చాలా మంది జియో వినియోగదారులు తమ జియో నంబర్‌లతో ప్రస్తుతానికి సెల్యులార్ కాల్‌లు చేయలేకపోతున్నారని తెలిపారు. అంతరాయాన్ని పరిష్కరించే వరకు, జియో వినియోగదారులు కమ్యూనికేషన్ కోసం ప్రత్యామ్నాయ నంబర్‌ను ఉపయోగించుకోవడం బెటర్. అది సాధ్యం కాకపోతే సమీపంలోని WiFi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయవచ్చు. WhatsApp కాల్స్ వంటి ఇంటర్నెట్ ఆధారిత కాలింగ్ సేవలను ఉపయోగించవచ్చు.