కండోమ్‌ లేని శృంగారం వైపే జంటల మొగ్గు.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

సురక్షిత శృంగారంతో పాటు గర్భనిరోధకం కోసం శృంగార ప్రియులు ఎక్కువగా కండోమ్స్‌ను వాడుతుంటారు. అయితే మన దేశంలో కండోమ్‌ల వినియోగం రోజురోజుకూ తగ్గిపోతున్నది.

By అంజి  Published on  25 Sep 2024 4:12 AM GMT
Andhra Pradesh, India, condoms, WHO, Health, Condom usage

కండోమ్‌ లేని శృంగారం వైపే జంటల మొగ్గు.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

సురక్షిత శృంగారంతో పాటు గర్భనిరోధకం కోసం శృంగార ప్రియులు ఎక్కువగా కండోమ్స్‌ను వాడుతుంటారు. అయితే మన దేశంలో కండోమ్‌ల వినియోగం రోజురోజుకూ తగ్గిపోతున్నది. భారత్‌లో అసురక్షిత సెక్స్‌ పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. వైద్యపరంగా, సురక్షితమైన సెక్స్ కోసం గర్భనిరోధకాలు లేదా కండోమ్‌లను ఉపయోగించడం మంచిది. కానీ సురక్షితమైన సెక్స్ మార్గదర్శకాలను పాటించడంలో భారతదేశం చాలా వెనుకబడి ఉందని డేటా సూచిస్తుంది.

కండోమ్‌లు లేకుండా శృంగారంలో పాల్గొంటున్న వారి సంఖ్య పెరిగిపోతున్నదని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ విడుదల చేసిన రిపోర్ట్‌ పేర్కొంది. ప్రతి ఏటా కండోమ్‌లు వాడుతున్న వారి సంఖ్య తగ్గిపోతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే విషయాన్ని మరోసారి వెలువరించింది. మన దేశంలో ఏయే రాష్ట్రాల్లో కండోమ్‌ల వినియోగం ఎక్కువగా ఉందన్న విషయంపై ఇటీవల ఓ సర్వే జరిగింది. ఈ సర్వేను నేషనల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ హెల్త్‌ నిర్వహించింది.

ఈ సర్వేలో కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్‌ హవేలీ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రతి 10 వేల జంటలలో 993 జంటలు కండోమ్‌లను వినియోగిస్తున్నారట. మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రాల పరంగా చూసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌దే మొదటి స్థానం. ఇక్కడ ప్రతి 10 వేల జంటలలో 978 జంటలు కండోమ్‌లు వినియోగిస్తున్నాయి. ఉంది. కర్ణాటకలో ప్రతి 10 వేల జంటలలో కేవలం 307 జంటలు మాత్రమే కండోమ్‌లను వినియోగిస్తున్నాయి.

పంజాబ్‌లో 895, చంఢీగఢ్‌లో 822, హర్యానాలో 685 జంటలు కండోమ్‌లు వినియోగిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రతి 10 వేల జంటల్లో 567 జంటలు, రాజస్థాన్‌లో ప్రతి 10 వేల జంటల్లో 514 జంటలు, గుజరాత్‌లో ప్రతి 10 వేల జంటల్లో 430 జంటలు కండోమ్‌లు వినియోగిస్తున్నాయి.మన దేశంలో కండోమ్‌ల గురించి తెలియని వారు 6 శాతం మంది ఉన్నారు. భారత్‌లో ఏటా 33.07 కోట్ల కండోమ్‌లు అమ్ముడవుతున్నాయని ఈ సర్వేలో తేలింది.

Next Story