పాతబడిన, చిరిగిన నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
RBI key decision on obsolete, torn notes. భారతీయ కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
By Medi Samrat Published on 1 March 2021 11:31 AM IST
పాడైపోయిన, చిరిగిపోయిన నోట్లను ప్రతి బ్యాంకు తప్పనిసరిగా తీసుకోవాలని, ఆ నోట్లను తీసుకువచ్చిన వ్యక్తుల తమ ఖాతాదారులా..? కాదా అని చూడవద్దని తెలిపింది. నోట్లను మార్పిడి చేసుకునేందుకు ఎలాంటి చార్జీలు కూడా వసూలు చేయవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. కాగా, ఏపీలోని కృష్ణా జిల్లాలో ఇటీవల రూ.5 లక్షల విలువైన నోట్లు చెదలు పట్టిన ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. తీవ్రంగా దెబ్బతి చెల్లుబాటు కాని నోట్లు కూడా ఇతర పద్దతుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. అయితే ఇలాంటి నోట్లపై నెంబర్ మాత్ర తప్పకుండా కనిపించాల్సి ఉంటుంది. నిజానికి పాడైపోయిన నోట్లను కమీషన్ తీసుకుని మంచి నోట్లను ఇస్తున్న వ్యాపారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దందా ఆర్బీఐ కార్యాలయాల సమీపంలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వీరంతా కూడా ఈ పాడైన నోట్లను బ్యాంకుల్లో, ఆర్బీఐ కారర్యాలయాలలోనే మార్చుకుంటున్నారని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.