డేరా బాబాకు 50 రోజుల పెరోల్

ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ అలియాస్ డేరా బాబాకు

By Medi Samrat  Published on  19 Jan 2024 1:45 PM GMT
డేరా బాబాకు 50 రోజుల పెరోల్

ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ అలియాస్ డేరా బాబాకు 50 రోజుల పెరోల్ మంజూరైంది. అంతకుముందు 2023 నవంబర్‌లో 21 రోజుల పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. గత ఏడాది అతనికి ఏకంగా మూడుసార్లు పెరోల్ లభించింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో భారీ అనుచరులు ఉన్న రామ్ రహీమ్.. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవాలని చెబుతూ అనేకసార్లు పెరోల్‌పై జైలు నుండి విడుదలయ్యాడు.

ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసినందుకు 2017లో అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 2002లో జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి, డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్యలతో సహా రెండు హత్య కేసుల్లో జీవిత ఖైదును అనుభవిస్తూ ఉన్నాడు. డేరా మేనేజర్ రంజిత్ సింగ్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినందుకు రామ్ రహీమ్ కూడా దోషిగా నిర్ధారించింది కోర్టు. 16 ఏళ్ల క్రితం జర్నలిస్టును హత్య చేసిన కేసులో డేరా చీఫ్, మరో ముగ్గురు 2019లో దోషులుగా తేలారు. హర్యానా రాష్ట్రంలో మంచి ప్రవర్తన ఖైదీల (తాత్కాలిక విడుదల) చట్టం, 2022 ప్రకారం, దోషులుగా తేలిన ఖైదీలకు సాధారణ పెరోల్ మంజూరు చేయవచ్చు. దీంతో డేరా బాబు ఛాన్స్ దొరికినప్పుడల్లా జైలు నుండి పెరోల్ మీద బయటకు వస్తున్నారు.

Next Story