రామేశ్వరం కేఫ్‌ పేలుడు.. నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు

బెంగళూరు రామేశ్వ‌రం కేఫ్ పేలుడు కేసును విచారిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బుధవారం పేలుడుకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి ఫోటోను విడుదల చేసింది.

By Medi Samrat  Published on  6 March 2024 6:32 PM IST
రామేశ్వరం కేఫ్‌ పేలుడు.. నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు

బెంగళూరు రామేశ్వ‌రం కేఫ్ పేలుడు కేసును విచారిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బుధవారం పేలుడుకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి ఫోటోను విడుదల చేసింది. అతని గురించి సమాచారం / ఆధారాలు అందించినందుకు గాను రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది.

మార్చి 1న బెంగుళూరు వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి ఎన్‌ఐఏకు కీలకమైన క్లూ లభించిందని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర బుధవారం తెలిపారు. ఈ కేసును ఎన్‌ఐఏ, బెంగళూరు పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ వింగ్ సంయుక్తంగా విచారిస్తున్నాయని పరమేశ్వర తెలిపారు.

రామేశ్వరం కేఫ్ వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలో అనేక ప్రసిద్ధ ఐటీ కంపెనీ ఆఫీసులు ఉన్నాయి. నిందితుడి సీసీటీవీ ఫుటేజీని దర్యాప్తు సంస్థలు సేకరించినప్పటికీ.. అతడిని ఇంకా పట్టుకోలేకపోయారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేర‌స్తుడిని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని తెలిపారు.

మూలాల ప్రకారం.. పేలుడు వెనుక ఉన్న వ్యక్తి.. "దర్యాప్తు సంస్థలను గందరగోళానికి గురిచేయడానికి" కేఫ్‌కు వచ్చే, వెళ్లే సమయంలో సుమారు 10 బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులలో ప్ర‌యాణించిన‌ట్లు నివేదిక‌లు పేర్కొంటున్నాయి. పేలుడు జరిగిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలను కూడా అధికారులు స్కాన్ చేస్తున్నారని మూలాలు పేర్కొంటున్నాయి.

Next Story