రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha bypolls for six seats. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల నిర్ణయం తీసుకుంది

By M.S.R  Published on  9 Sep 2021 10:06 AM GMT
రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల నిర్ణయం తీసుకుంది. ఏడు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో రెండు రాజ్యసభ సీట్లు, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 5 రాజ్య సభ స్థానాలు భర్తీ కానున్నాయి. ఆయా రాజ్యసభ స్థానాల కోసం ఈ నెల 15న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదే నెల 22న నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. అలాగే 27న నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఇక ఈ రాజ్యసభ ఎన్నికలు అక్టోబర్‌ 4న జరుగనున్నాయి.

కౌంటింగ్‌ కూడా అదే రోజు పూర్తి కానుంది. ఈ మేరకు రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌లో కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. అలాగే ఓట్ల లెక్కింపు కూడా అక్టోబర్ 4న ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలోనే ఓటింగ్ కు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతతో పాటు కరోనా మార్గదర్శకాల మధ్య ఉప ఎన్నికలు నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఆశావహులు ఎంతో ఆతృతగా ఈ షెడ్యూల్ వైపు చూస్తున్నారు.


Next Story
Share it