కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ క‌న్నుమూత‌

Rajasthan Congress MLA Bhanwar Lal Sharma dies at 77.సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Oct 2022 5:25 AM GMT
కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ క‌న్నుమూత‌

రాజస్థాన్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న్ను శ‌నివారం సాయంత్రం జైపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 77 సంవ‌త్స‌రాలు. ఆయ‌న భౌతిక‌కాయాన్ని హ‌నుమాన్ న‌గ‌ర్‌లోని ఆయ‌న స్వ‌గృహానికి త‌ర‌లించారు. ప్రజలు నివాళులర్పించేందుకు విద్యాధర్ నగర్ బ్రాహ్మణ మహాసభ భవనంలో ఉంచనున్నారు. సోమ‌వారం మధ్యాహ్నం సర్దార్‌షహర్‌లో ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం

భన్వర్ లాల్ శర్మ మృతిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. అత‌డి కుటుంబ స‌భ్యుల‌తో ట‌చ్‌లోనే ఉన్నాను. నిన్న సాయంత్రం కూడా ఎస్ఎంఎస్ ఆస్ప‌త్రి వెళ్లి ప‌రామ‌ర్శించాను. ఈ క్లిష్ట సమయంలో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

భన్వర్ లాల్ శర్మ ఏప్రిల్ 17, 1945న రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని సర్దార్‌షహర్‌లోని జైత్‌సిసర్ గ్రామంలో జ‌న్మించారు. 17 ఏళ్ల వ‌య‌సులోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 1962లో జైత్‌సిసర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందారు. 1962 నుంచి 1982 వరకు సర్పంచ్‌గా కొనసాగారు. 1985లో తొలిసారి లోక్‌ద‌ళ్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జనతాదళ్ పార్టీలో చేరారు. 1990లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 1998, 2003, 2013,2018 ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచారు.

Next Story