అమేథీ నుంచే రాహుల్ గాంధీ పోటీ.. కాంగ్రెస్ నేత వ్యాఖ్య‌లు

యూపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు అజయ్ రాయ్ బాధ్యతలు స్వీకరించారు.

By Medi Samrat  Published on  18 Aug 2023 5:47 PM IST
అమేథీ నుంచే రాహుల్ గాంధీ పోటీ.. కాంగ్రెస్ నేత వ్యాఖ్య‌లు

యూపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు అజయ్ రాయ్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని టార్గెట్ చేస్తూనే.. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారని కూడా సూచించారు.

యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అజయ్ రాయ్ మాట్లాడుతూ.. ‘‘ఖచ్చితంగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందన్నారు. దీంతో పాటు ప్రియాంక గాంధీ తాను కోరుకున్న చోట నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ప్రియాంక గాంధీ బనారస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తే, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తన ప్రాణాలకు తెగించి పోరాడుతారని ఆయన అన్నారు.

స్మృతి ఇరానీపై అజయ్ రాయ్ ఫైర్ అయ్యారు. స్మృతి ఇరానీకి కిలో చక్కెర రూ.13కి లభిస్తోందని అజయ్ రాయ్ ఎద్దేవా చేశారు. అమేథీ ప్రజలు మాతో పాటు ఇక్కడికి వచ్చారని.. క‌మ‌లానికి ఓటేస్తే రూ.13 కు కిలో చక్కెర వస్తుందని చెప్పారు.. మీరు పొందుతున్నారా.. వారికి చెప్పండ‌ని అజయ్ రాయ్ డిమాండ్ చేశారు.

Next Story