బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేసినట్లు ఉంది : రాహుల్

కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్ 2025పై తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on  1 Feb 2025 7:15 PM IST
బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేసినట్లు ఉంది : రాహుల్

కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్ 2025పై తీవ్ర విమర్శలు చేశారు. “బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్” వేసినట్లు ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచం మొత్తం అనిశ్చితి నెలకొన్న సమయంలో, ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడం ముఖ్యం.. కానీ ఈ ప్రభుత్వం ఆలోచనలతో దివాళా తీసిందని రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు.అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నడుమ దేశ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఒక మార్పు అవసరమని అన్నారు. కానీ ఆ విషయంలో ప్రభుత్వం వద్ద ఆలోచనలు లేవని విమర్శించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా కేంద్ర బడ్జెట్‌ను తప్పుబట్టారు. కీలకమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాక, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రధాని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని అన్నారు. గత దశాబ్ద కాలంగా రూ.54.18 లక్షల కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేసిన ప్రభుత్వం మధ్యతరగతి వర్గాలకు చిన్నపాటి పన్ను మినహాయింపును అందజేస్తోందని తెలిపారు.

Next Story