నైట్‌క్లబ్‌లో రాహుల్ గాంధీ.. వీడియో వైరల్‌

Rahul Gandhi seen at nightclub in viral video. కాంగ్రెస్ యువ‌నేత‌ రాహుల్ గాంధీ ఖాట్మండులోని ఒక నైట్‌క్లబ్‌లో ఉన్న‌ వీడియోలో కనిపించారు

By Medi Samrat
Published on : 3 May 2022 10:30 AM

నైట్‌క్లబ్‌లో రాహుల్ గాంధీ.. వీడియో వైరల్‌

కాంగ్రెస్ యువ‌నేత‌ రాహుల్ గాంధీ ఖాట్మండులోని ఒక నైట్‌క్లబ్‌లో ఉన్న‌ వీడియోలో కనిపించారు. వైరల్ వీడియోలో అతని చుట్టూ ఉన్న వ్యక్తులు మద్యం సేవించడం చూస్తే డిస్కోథెక్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకత్వం తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను చేర్చుకునే పార్టీ ప్రయత్నం విఫలమైన సమయంలో ఈ వైరల్ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఖాట్మండులో ఉన్న రాహుల్ గాంధీ స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. ఇక‌ వీడియోలో, రాహుల్‌ పార్టీకి హాజరయిన‌ట్లు కనిపిస్తోంది. ఈ వీడియో వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఖాట్మండు పోస్ట్‌ కథనం ప్రకారం.. రాహుల్ గాంధీ సోమవారం మధ్యాహ్నం నేపాల్ రాజధాని నగరానికి చేరుకున్నారు. మయన్మార్‌లో నేపాలీ మాజీ రాయబారి భీమ్ ఉదాస్ తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా రాహుల్ గాంధీకి ఆహ్వానం పంపినట్లు దినపత్రిక పేర్కొంది. నేపాలీ ప్రచురణ ప్రకారం.. ఉదాస్ కుమార్తె సుమ్నిమా, మాజీ CNN కరస్పాండెంట్, నిమా మార్టిన్ షెర్పాతో వివాహం జరిగింది. గ‌తంలో ఆగస్ట్ 2018లో రాహుల్ గాంధీ కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లే మార్గంలో ఖాట్మండును సందర్శించారు. లార్డ్ ఆఫ్ రింగ్స్ అనే నైట్‌క్లబ్‌లో రాహుల్ గాంధీ వైరల్ వీడియోలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయిందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సుదీర్ఘ చర్చలు అకస్మాత్తుగా ముగిశాయి. ఇటువంటి స‌మ‌యంలో బ‌య‌ట‌కువ‌చ్చిన‌ ఈ వీడియో ప‌లు ర‌కాల చ‌ర్చ‌ల‌కు దారితీస్తుందని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.










Next Story