నా ఫోన్‌ను ట్యాప్ చేశారు.. రాహుల్‌గాంధీ
Rahul Gandhi says my phone is tapped.కొద్ది రోజులుగా సంచలనం రేపుతున్న ఇజ్రాయెలీ స్పేస్‌వేర్ పెగాసస్
By తోట వంశీ కుమార్ Published on 23 July 2021 7:33 AM GMTకొద్ది రోజులుగా సంచలనం రేపుతున్న ఇజ్రాయెలీ స్పేస్‌వేర్ పెగాసస్ వ్యవహరంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఫోనును కూడా ట్యాప్ చేశారన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ చర్యలకు తాను భయపడబోనని చెప్పారు. మోసాలకు పాల్పడే వారికే భయం ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా స్పైవేర్ సాఫ్ట్ వేర్ వాడాలరని రాహుల్ అన్నారు.
సీబీఐ డైరెక్టర్ ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేశారని తెలిపారు. పెగాసస్ ఓ ఆయుధం వంటిదని, ఇది ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాడడం కోసం ఉద్దేశించినదని ఇజ్రాయెల్ ఇప్పటికే పేర్కొందని అన్నారు. ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి కలసి దేశానికి వ్యతిరేకంగా, వ్యవస్థలకు వ్యతిరేకంగా పెగాసస్ ను వాడారని ఆయన ఆరోపించారు. పెగాసన్ వ్యవహరంపై కేంద్రం సమాధానం చెప్పాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇక పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న విబేదాలపైనా రాహుల్ గాంధీ స్పందించారు. ప్రస్తుతం సమస్య సద్దుమణిగిందన్నారు. పంజాబ్ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ శుక్రవారం కలుసుకున్న కొద్దిసేపటికే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా.. నవజోత్ సింగ్ సిద్దూ నేడు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు.