ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. సోనియాకు రాహుల్‌గాంధీ లిటిల్ సర్‌ప్రైజ్

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తన తల్లి సోనియాగాంధీకి లిటిల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  4 Oct 2023 3:54 PM IST
Rahul gandhi, little gift,  sonia gandhi, viral video,

 ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. సోనియాకు రాహుల్‌గాంధీ లిటిల్ సర్‌ప్రైజ్

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తన తల్లి సోనియాగాంధీకి లిటిల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తల్లికి చెప్పకుండా ఒక బహుమతిని అందించి ఎంతో సంతోష పరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ గోవా నుంచి ఒక చిన్న కుక్కపిల్లను తెప్పించారు. ఆ తర్వాత తన తల్లి సోనియాగాంధీకి గిఫ్ట్‌గా అందించారు. ఆ బుజ్జి కుక్కపిల్లను చూడగానే సోనియాగాంధీ ఎంతో సంబరపడిపోయారు. వెంటనే చేతుల్లోకి తీసుకుని కాసేపు ముద్దు చేశారు. అంతేకాదు.. సోనియాగాంధీ ఆ చిన్ని కుక్కపిల్లకు పేరు కూడా పెట్టారు. 'నూరీ' అని పిలవాలని అనుకున్నట్లు చెప్పారు. కాగా.. ఈ వీడియోను వరల్డ్‌ యానిమల్‌ డే సందర్భంగా అక్టోబర్ 4వ తేదీన రాహుల్‌ గాంధీ తన యూట్యూబ్‌ చానెల్‌లో షేర్ చేశారు. తమ కుటుంబంలోకి కొత్తగా వచ్చిన అందమైన మెంబర్‌ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అందరికీ చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. ఇది గోవా నుంచి నేరుగా తమ చేతుల్లోకి వచ్చిందన్నారు. తమ జీవితాల్లో వెలుగుగా మారిందని రాహుల్ అన్నారు. అది అందించే అవధుల్లేని ప్రేమ, విశ్వాసంతో పాటు.. ఈ చిన్న జంతువు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అని రాహుల్‌గాంధీ చెప్పారు.

కాగా.. ఆగస్టు నెలలో రాహుల్‌ గాంధీ గోవా వెళ్లారు. అక్కడ పలువురిని కలిశారు. ఆ క్రమంలో డాగ్‌ బ్రీడర్స్‌ను కూడా కలిశారు. వారిలో ఒకరు శార్వాణి పిత్రే, స్టాన్లీ బ్రగాంజా దంపతులు. వారి వద్ద ఉన్న కుక్క పిల్లల్లో ఒక బ్రీడ్‌ను రాహుల్‌ సెలెక్ట్‌ చేసుకున్నారు. అదే ఇప్పుడు నూరీ పేరుతో తన తల్లికి రాహుల్ గిఫ్ట్‌గా ఇచ్చారు. తన కుమారుడు ఇచ్చిన గిఫ్ట్‌ను ప్రేమగా చూసుకుంటున్నారు సోనియా. ఆ నూరీ కోసం ఒక చిన్న బెడ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

Next Story