భారత్ జోడో యాత్ర.. ఆసక్తికర ఘటన..

Rahul Gandhi Helps Little Girl Wear Shoe During Bharat Jodo Yatra. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర మొదలైన సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  18 Sep 2022 1:30 PM GMT
భారత్ జోడో యాత్ర.. ఆసక్తికర ఘటన..

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర మొదలైన సంగతి తెలిసిందే..! ఆదివారం కేరళలోని హరిపాడ్ లో యాత్ర‌ ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటల తర్వాత ప్రారంభమైన యాత్రలోని అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. కొన్నింటిలో రాహుల్ గాంధీ రోడ్డుకు ఇరువైపులా వేచి ఉన్న ప్రజలను పలకరిస్తూ కనిపించారు. అంతేకాకుండా హోటల్ లో టీని ఆస్వాదిస్తూ కనిపించాడు.

యాత్ర 11వ రోజు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ ఒక చిన్న అమ్మాయికి పాదరక్షలు వేస్తూ సహాయం చేయ‌డం కనిపించింది. ఈ వీడియోను మహిళా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ట్విట్టర్‌లో షేర్ చేశారు. యాత్ర ముందుకు సాగుతూ ఉండగా.. ఓ చిన్నారి కూడా వాళ్ళతో కలిసి ముందుకు కదిలింది. ఇంతలో ఆ చిన్నారి నడవడం ఆపేసింది. ఏమైందా అని అక్కడ ఉన్న వాళ్లు చూస్తూ ఉండగానే.. రాహుల్ గాంధీ కూడా ఆమె దగ్గరకు చేరుకున్నాడు. వెంటనే ఆ చిన్నారికి పాద రక్షలు వేసుకోవడంలో సహకరించారు.

వార్తా సంస్థ పిటిఐ ప్రకారం.. రాహుల్ గాంధీతో పాటూ రమేష్ చెన్నితాల, కె మురళీధరన్, కొడికున్నిల్ సురేష్, కె సి వేణుగోపాల్, ప్రతిపక్ష నాయకుడు వి.డి సతీశన్‌తో సహా సీనియర్ నాయకులు 13 కి.మీ పాటూ రాహుల్ గాంధీ పక్కన నడుస్తూ కనిపించారు. ఈ యాత్ర సెప్టెంబర్ 21, 22 తేదీల్లో ఎర్నాకులం జిల్లా గుండా ప్రయాణించి సెప్టెంబర్ 23న త్రిసూర్ చేరుకుంటుంది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో పాలక్కాడ్ మీదుగా ప్రయాణించి సెప్టెంబర్ 28న మలాపురంలోకి ప్రవేశిస్తుంది.



Next Story