కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీ 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) కోర్టు ముందు హాజరయ్యారు. మాజీ ఎంపీ, డీసీఎం డీకే. శివకుమార్ సోదరుడు డి.కె.సురేష్.. రాహుల్ గాంధీకి పూచీకత్తు ఇచ్చారు. కేసు విచారణను కోర్టు జూలై 30కి వాయిదా వేసింది. రాహుల్ గాంధీ రావడంతో న్యాయవాదులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోర్టు ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది.
కోర్టు విచారణ అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం శివకుమార్‌లు ఒకే కారులో కోర్టు ప్రాంగణం నుంచి బయలుదేరారు. రాహుల్ గాంధీ వాహనంపై నుంచి పార్టీ కార్యకర్తల వైపు చేతులు ఊపారు.