ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
Rahul Gandhi appears before ED. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఢిల్లీ వీధుల్లో
By Medi Samrat Published on 13 Jun 2022 12:16 PM ISTనేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తల నినాదాల మధ్య గాంధీ, సోదరి మరియు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లారు. ఈ నిరసన ర్యాలీని ఆపడానికి ఢిల్లీ పోలీసులు భారీ బలగాలను మోహరించారు. కాంగ్రెస్ నేతలు రోడ్లపై కూర్చొని నిరసన కొనసాగించారు.
ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో రాహుల్‌కు మద్దతుగా అక్బర్ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ఆ రోజు భారీ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించాయి. ఈ మేరకు పార్టీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, సీనియర్ నాయకులకు సమాచారం కూడా అందింది. పలు రాష్ట్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ఈనెల 2నే ఈడీ విచారణకు హాజరుకావాల్సింది. కానీ విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేనని రాహుల్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈనెల 13న విచారణకు హాజరవ్వాలని ఈడీ తెలిపింది. దీంతో నేడు విచారణకు హాజరయ్యారు రాహుల్ గాంధీ.