"పిక్చర్ అభీ బాకీ హై"..ఆప్ నేతల ఆరోపణలపై రాఘవ్ చద్దా ఘాటు వ్యాఖ్యలు

ఆమ్ ఆద్మీ పార్టీలో (ఆప్) ముదురుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తనపై వస్తున్న ఆరోపణలను దీటుగా తిప్పికొట్టారు.

By -  Knakam Karthik
Published on : 5 April 2026 6:17 PM IST

National News, Delhi, RaghavChadha, AamAadmiParty, AAPInternalRift, PunjabPolitics, Parliament

"పిక్చర్ అభీ బాకీ హై"..ఆప్ నేతల ఆరోపణలపై రాఘవ్ చద్దా ఘాటు వ్యాఖ్యలు

ఆమ్ ఆద్మీ పార్టీలో (ఆప్) ముదురుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తనపై వస్తున్న ఆరోపణలను దీటుగా తిప్పికొట్టారు. పంజాబ్ సమస్యలను పార్లమెంటులో పట్టించుకోవడం లేదన్న విమర్శలకు సమాధానంగా, తాను సభలో ప్రసంగించిన వీడియో క్లిప్‌ను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. తనపై వ్యతిరేక వీడియోలు విడుదల చేయాలని ఒత్తిడికి గురవుతున్న సహచర నేతలకు ఇది కేవలం ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు.

పంజాబ్ తనకు కేవలం రాజకీయ అంశం కాదని, అది తన ఆత్మ అని చద్దా భావోద్వేగంగా పేర్కొన్నారు. రాజ్యసభలో ఆప్ ఉప నేత పదవి నుంచి తొలగించిన తర్వాతే తనపై కుట్రపూరితంగా, ఒకే రకమైన ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల వాకౌట్‌కు మద్దతు ఇవ్వలేదన్నది పచ్చి అబద్ధమని, కావాలంటే పార్లమెంటు సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. తనపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, పంజాబ్ ప్రజల గొంతుకగా తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Next Story