రాష్ట్రపతి భవన్ వద్ద రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరుదేశాల ఉన్నతాధికారులతో కరచాలనం చేశారు. భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ భారత్‌కు వచ్చారు. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అణు విద్యుత్ సహా పలు రంగాల్లో కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ, వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం స్వయంగా స్వాగతం పలికారు. పాలం విమానాశ్రయం నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించగా ప్రస్తుతం ఆ వాహనం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోదీ తాను వాడే విలాసవంతమైన రేంజ్‌రోవర్ కారును పక్కనపెట్టి మరీ ఒక సాధారణ ఫార్చ్యూనర్‌లో వ్లాదిమిర్ పుతిన్‌ను తీసుకెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది.