ఐపీఎస్ అధికారిణిని పెళ్లి చేసుకోబోతున్న ఎమ్మెల్యే

Punjab Minister Harjot Singh Bains to tie knot with IPS officer Jyoti Yadav. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్జోత్ సింగ్ బైన్స్, ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్‌తో ఈ నెలాఖరున వివాహం చేసుకోనున్నారు

By Medi Samrat
Published on : 13 March 2023 5:15 PM IST

ఐపీఎస్ అధికారిణిని పెళ్లి చేసుకోబోతున్న ఎమ్మెల్యే

పంజాబ్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్జోత్ సింగ్ బైన్స్, ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్‌తో ఈ నెలాఖరున వివాహం చేసుకోనున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి హర్జోత్ సింగ్ బైన్స్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు.

32 ఏళ్ల బైన్స్ ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని గంభీర్‌పూర్ గ్రామానికి చెందినవాడు. మొదటిసారి శాసనసభ్యుడుగా అడుగుపెట్టాడు. రాజకీయాల్లోకి రాకముందు అతను వృత్తిరీత్యా న్యాయవాది. అతను పంజాబ్‌లో AAP యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. అతను చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో 2014లో పట్టభద్రుడయ్యాడు. పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి జ్యోతి యాదవ్ మాన్సా జిల్లాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. ఆమె గురుగ్రామ్‌కు చెందినవారు. వీరి మాధ్య ప్రేమ చిగురించి పెళ్లి దాకా వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిని అభినందిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Next Story