రామ్‌లీలా నాటకం.. సిగరెట్‌ తాగిన సీత పాత్రధారి.. ఐదుగురు అరెస్ట్

హిందూ సమాజం యొక్క మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్, ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు.

By అంజి  Published on  4 Feb 2024 6:41 AM IST
Pune, professor, students, arrest, Ramleela, Sita, smoking

రామ్‌లీలా నాటకం.. సిగరెట్‌ తాగిన సీత పాత్రధారి.. ఐదుగురు అరెస్ట్

హిందూ సమాజం యొక్క మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్, ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్‌ చేసింది. 'రామ్‌లీలా' ఆధారిత నాటకంలో అభ్యంతరకరమైన డైలాగ్‌లు, సన్నివేశాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ అరెస్టు జరిగింది. నాటకం ప్రదర్శించబడుతున్నట్లు చూపించే వైరల్ వీడియోలో, సీత పాత్ర చేస్తున్న ఓ పురుష కళాకారుడు సిగరెట్ తాగుతూ, దుర్భాషలాడుతూ కనిపించాడు. దీనికి రాముడు పాత్రధారి సహకరించడం వంటి దృశ్యాలు, అసభ్యకర డైలాగులు ఉన్నాయి.

శుక్రవారం యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శించిన ఈ నాటకంతో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు, పూణే యూనివర్సిటీలోని లలిత కళా కేంద్రానికి చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. అధికారికంగా సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని పిలవబడే లలిత కళా కేంద్రం వారి నాటకం, 'రామ్‌లీలా'లో వివిధ పాత్రలు చేసే నటుల బ్యాక్‌స్టేజ్ పరిహాసంపై ఆధారపడింది. ఏబీవీపీ కార్యకర్త హర్షవర్ధన్ హర్పుడే చేసిన ఫిర్యాదు ఆధారంగా, సెక్షన్ 295 (A) (ఉద్దేశపూర్వకంగా మరియు దురుద్దేశపూర్వకంగా ఏ వర్గానికి చెందిన మతపరమైన భావాలను కించపరిచే ఉద్దేశ్యంతో), భారతీయ శిక్షాస్మృతిలోని ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. లలిత్ కళా కేంద్రం విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్ భోలేతో పాటు విద్యార్థులు భవేష్ పాటిల్, జే పెడ్నేకర్, ప్రథమేష్ సావంత్, రిషికేష్ దాల్వీ, యశ్ చిఖ్లేలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story