నిర్మానుష్య ప్రదేశంలో యువకునితో కుమార్తె.. తర్వాత తండ్రి ఏం చేశాడంటే..!

Publicly thrashing of young man and woman in MP.తమ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు సాగిస్తుంటారు కొందరు యువతీయువకులు. కొందరైతే

By అంజి  Published on  16 Oct 2021 10:13 AM IST
నిర్మానుష్య ప్రదేశంలో యువకునితో కుమార్తె.. తర్వాత తండ్రి ఏం చేశాడంటే..!

తమ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు సాగిస్తుంటారు కొందరు యువతీయువకులు. కొందరైతే నిర్మానుష్య ప్రదేశాల్లో, పార్కుల్లో తమ ప్రేమ వ్యవహారాలు చేస్తారు. అయితే ఈ ప్రేమ వ్యవహారాలు ఏదో ఒక రోజు తల్లిందండ్రులకు తెలుస్తాయి.. ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా మారుతాయి. ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. హర్దా జిల్లాలోని ఖేదీనీమా రోడ్డు దగ్గర గల ఓ నిర్మానుష్య ప్రదేశంలో తన ప్రియుడితో కలిసి ఉండగా తన తండ్రి కంట పడింది ఓ యువతి. దీంతో ఆ తండ్రికి కోపం కట్టలు తెచ్చుకుంది.

ఇంకేముంది నడుముకున్న బెల్టు తీసి.. ఇద్దరిని చావబాదాడు. తన కుమార్తె వేరే యువకుడితో కలిసి ఉండడాన్ని తట్టుకోలేకపోయిన ఆ తండ్రి ఆగ్రహంతో నడి రోడ్డు మీద కుమార్తెపై, యువకుడిపై దాడి చేశాడు. ఈ ఘటనను అక్కడున్న కొందరు తమ ఫోన్‌లో వీడియో తీశారు. దాడి చేసిన వీడియో బయటకు రావడంతో కలకలం రేగింది. ఈ వీడియో ప్రస్తుతం సొషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా యువతి తండ్రి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో యువకుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హత్య, బెదిరించడం వంటి ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story