విషాదం.. పట్టాలపై కూర్చొని పబ్జీ.. రైలు ఢీకొనడంతో ముగ్గురు మృతి

రైలు పట్టాలపై కూర్చొని మొబైల్‌లో పబ్జీ ఆడుతున్న ముగ్గురిని రైలు ఢీకొట్టింది. దీంతొ ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.

By అంజి  Published on  3 Jan 2025 11:17 AM IST
PUBG, Railway Tracks, Bihar, Narakatia Ganj-Muzaffarpur railway section, West Champaran district

విషాదం.. పట్టాలపై కూర్చొని పబ్జీ.. రైలు ఢీకొనడంతో ముగ్గురు మృతి

రైలు పట్టాలపై కూర్చొని మొబైల్‌లో పబ్జీ ఆడుతున్న ముగ్గురిని రైలు ఢీకొట్టింది. దీంతొ ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. నిమగ్నమైన ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరకాతియా గంజ్-ముజఫర్‌పూర్ రైల్వే సెక్షన్‌లోని మాన్సా తోలా ప్రాంతంలోని రాయల్ స్కూల్ సమీపంలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. బాధితులు గుమ్టికి చెందిన ఫుర్కాన్ ఆలం, మాన్సా తోలాకు చెందిన సమీర్ ఆలం, బారి తోలాకు చెందిన హబీబుల్లా అన్సారీ ఇయర్‌ఫోన్‌లు పెట్టుకున్నారు. దీంతో వారు రైలు వస్తున్నట్లు గుర్తించలేకపోయారు.

వేగంగా వస్తున్న రైలు వారిపై నుంచి వెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో వందలాది మంది స్థానికులు గుమిగూడారు. మృతుల కుటుంబీకులు మృతదేహాలను అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామాలకు తరలించారు. వివేక్ దీప్, సదర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO), రైల్వే పోలీసులతో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించి, సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలించారు. రైల్వే ట్రాక్‌లపై మొబైల్ గేమ్‌లు ఆడడం వల్ల కలిగే ప్రమాదాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల గేమింగ్ అలవాట్లను పర్యవేక్షించాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు కూడా నొక్కి చెప్పారు.

Next Story