మేడమ్ ఇప్పుడు ఏసీ తీసేస్తారు..ప్రిన్సిపాల్‌ చర్యపై విద్యార్థి నేతల నిరసన

క్లాస్ రూమ్స్ గోడలకు ఓ ప్రిన్సిపాల్ ఆవుపేడను పూసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే

By Knakam Karthik
Published on : 16 April 2025 12:42 PM IST

National News, Delhi, Delhi University, Cow Dung,

మేడమ్ ఇప్పుడు ఏసీ తీసేస్తారు..ప్రిన్సిపాల్‌ చర్యపై విద్యార్థి నేతల నిరసన

క్లాస్ రూమ్స్ గోడలకు ఓ ప్రిన్సిపాల్ ఆవుపేడను పూసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దేశీయ పద్ధతుల్లో తరగతి గది చల్లగా మారడానికి ప్రయోగం చేస్తున్నానని ఢిల్లీలోని లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపాల్ ప్రత్యూష వత్సల ఇటీవల క్లాస్ రూమ్ గోడలకు పేడ పూశారు. ఈ చర్యను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే దీనిపై యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు రోనక్ ఖత్రి నేతృత్వంలోని విద్యార్థులు ప్రిన్సిపాల్ రూమ్‌లో నిరసన తెలియజేశారు.

ప్రిన్సిపల్ ఆఫీస్‌లోకి వెళ్లిన కొందరు విద్యార్థి నేతలు గోడలకు ఆవు పేడను పూశారు. ఇప్పుడు ప్రిన్సిపల్ రూమ్‌కు కూడా పేడ పూశాం కాబట్టి చల్లగా ఉంటుంది. ఇక ఈ గదిలో ఉన్న ఏసీ రిమూవ్ చేసి విద్యార్థులకు ఇచ్చేస్తారు. ఆవు పేడతో వచ్చే ఆ చల్లదనంతోనే మేడమ్ సమ్మర్‌లో డ్యూటీ చేస్తారని మేము నమ్ముతున్నాం..అని రోనక్ ఖత్రి చెప్పారు. విద్యార్థుల సమ్మతి లేకుండానే తరగతి గదులకు పేడ పూయడం ఏంటని మండిపడ్డారు. పేడ వాసన వల్ల విద్యార్థులు తరగతిలో కూర్చోలేకపోతున్నారన్నారు. ఇటువంటి ప్రయోగాలు ఏమైనా ఉంటే ఆమె ఇంటిలో చేసుకోవాలని.. విద్యార్థులను ఇబ్బందిపెట్టొద్దని కోరారు.

Next Story