క్లాస్‌లో ప్రపోజ్ చేసిన లెక్చరర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని

తరగతి గదిలో మాట్లాడుతూ ఓ విద్యార్థినికి ఐ లవ్ యు చెప్పిన ప్రొఫెసర్‌ పై తోటి విద్యార్థులు దాడికి తెగబడ్డారు.

By -  Medi Samrat
Published on : 26 March 2026 8:10 PM IST

క్లాస్‌లో ప్రపోజ్ చేసిన లెక్చరర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని

తరగతి గదిలో మాట్లాడుతూ ఓ విద్యార్థినికి ఐ లవ్ యు చెప్పిన ప్రొఫెసర్‌ పై తోటి విద్యార్థులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కర్ణాటక రాష్ట్రం నెలమంగళ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మెడికల్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది. క్లాస్ జరుగుతుండగా ప్రొఫెసర్ అందరి ముందే తన ప్రేమను వ్యక్తం చేశారు.

ఆ విద్యార్థిని వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రొఫెసర్ ప్రవర్తనను ప్రశ్నిస్తూ, తన చెప్పుతో కొట్టింది. ఇతర విద్యార్థులు కూడా ప్రొఫెసర్‌పై క్యాంపస్‌లో చేశారు. అంతకుముందు క్లాస్‌లో విద్యార్థిని ఎదురుతిరగడంతో, ఆమె కూడా తనకు ప్రపోజ్ చేసిందని, దానికి సీసీటీవీ ఫుటేజీలో ఆధారం ఉందని ప్రొఫెసర్ చెప్పాడు. ఆ ఫుటేజీని వెంటనే చూపించాలని విద్యార్థిని సవాలు చేయడంతో ప్రొఫెసర్ మాట దాటవేశాడు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Next Story