ప్రొఫెసర్ అలీ ఖాన్ కు బెయిల్

అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

By Medi Samrat
Published on : 21 May 2025 2:45 PM IST

ప్రొఫెసర్ అలీ ఖాన్ కు బెయిల్

అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అశోక విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి అయిన ప్రొఫెసర్ అలీ ఖాన్ ఆపరేషన్ సిందూర్ పై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ల గత వారం అరెస్టు చేశారు. సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, జాతీయ సమగ్రత, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేశారని ఆయనపై అభియోగాలు మోపారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అలీ ఖాన్ తరపున జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ముందు కేసును వాదించారు.

అలీ ఖాన్ మహ్మదాబాద్‌కు తాత్కాలిక మధ్యంతర బెయిల్ మంజూరైంది. బెయిల్‌తో పాటు, దీనిపై సిట్ ఏర్పాటుకు హర్యానా డీజీపీకి అనుమతి మంజూరు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి హర్యానాలో నివసించని ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని 24 గంటల్లో ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందులో ఒక మహిళా IPS అధికారి కూడా ఉండాలని సూచించింది. ఇంకా DGP-ర్యాంక్ అధికారి నేతృత్వంలో ఈ దర్యాప్తు సాగాలని చెప్పింది.

Next Story