కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీకి క‌రోనా

Priyanka Gandhi tests positive for Covid-19.గ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2022 11:57 AM IST
కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీకి క‌రోనా

కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. మ‌రోసారి త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింద‌ని, ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు ట్వీట్ చేసింది. కాగా.. ప్రియాంక గాంధీ క‌రోనా బారిన ప‌డ‌డం ఇది రెండోసారి. ఇంత‌క‌ముందు జూన్‌లో ఆమె ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు.

అటు రాహుల్‌ గాంధీ సైతం అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నేటి రాజస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. మంగళవారం కాంగ్రెస్‌ రాజ్యసభపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా త‌న‌కు క‌రోనా సోకిన‌ట్లు తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. వరుసగా కాంగ్రెస్‌ నేతలు కరోనా మహమ్మారి బారిన ప‌డుతుండ‌డంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.

మ‌రోవైపు ధ‌ర‌ల పెరుగుద‌ల‌, అగ్నిప‌థ్‌, నిత్యావ‌స‌రాల‌పై జీఎస్టీ పెంపు వంటి అంశాల‌పై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. ఢిల్లీలో జ‌రిగిన నిర‌సన‌ల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక‌, రాహుల్ గాంధీ, ఎంపీలు, నేత‌లు పాల్గొన సంగ‌తి తెలిసిందే.

Next Story