వాయనాడ్‌లో దూసుకెళ్తున్న ప్రియాంక గాంధీ..!
వాయనాడ్ ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది.
By Medi Samrat Published on 23 Nov 2024 4:32 AM GMTవాయనాడ్ ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది. ఫలితాలను అధికారిక ECI వెబ్‌సైట్ https://results.eci.gov.in/ లో యాక్సెస్ చేయవచ్చు. ఎర్లీ ట్రెండ్స్ లో ప్రియాంక గాంధీ వాద్రా ముందంజలో ఉన్నారు. ప్రియాంక గాంధీ బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌పై 68,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన ఎన్నికల అరంగేట్రం చేయడంతో వాయనాడ్ పార్లమెంటరీ స్థానం జాతీయ దృష్టిని ఆకర్షించింది. ప్రియాంక వాద్రా సిపిఐ కు చెందిన సత్యన్ మోకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్ పై పోటీ పడ్డారు. తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన విజయాన్ని ప్రియాంక పునరావృతం చేస్తుందని కాంగ్రెస్ యూనిట్ బలంగా నమ్ముతూ ఉంది.
పోలైన 9.52 లక్షల ఓట్లలో ఆమెకు దాదాపు ఆరు లక్షల ఓట్లు వస్తాయని జిల్లా కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేసింది. "ప్రియాంక గాంధీ గెలుపు లేదా మెజారిటీ గురించి మేము అస్సలు ఆందోళన చెందడం లేదు. తక్కువ ఓటింగ్ శాతం మెజారిటీపై ప్రభావం చూపదు’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.