ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు 35 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న మల్లయోధులు ఆదివారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినున్న సందర్భంగా.. మహిళా మహాపంచాయత్‌ను ప్రకటించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆందోళనకారులందరినీ అదుపులోకి తీసుకున్నారు. కొత్త పార్లమెంట్ వైపుకు బయలుదేరిన రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు బస్సుల్లో వివిధ ప్రాంతాలకు తరలించారు.
రెజ్లర్లపై పోలీసులు తీసుకున్న చర్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. క్రీడాకారుల ఛాతీపై ఉన్న పతకాలు మన దేశానికి గర్వకారణమని అన్నారు. ఆ పతకాలు, క్రీడాకారుల శ్రమతో దేశ గౌరవం పెరుగుతుంది. బీజేపీ ప్రభుత్వ దురహంకారం ఎంతగా పెరిగిపోయిందంటే.. కనికరం లేకుండా మన మహిళా క్రీడాకారుల గొంతులను బూటు కింద తొక్కేస్తోంది. ఇది పూర్తిగా తప్పు. ప్రభుత్వం చేస్తున్న దురహంకారాన్ని, ఈ అన్యాయాన్ని దేశం మొత్తం చూస్తోందన్నారు.