కుప్ప‌కూలిన హెలికాఫ్టర్.. ముంబై నుండి హైదరాబాద్ వస్తుండ‌గా..

ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న హెలికాప్టర్ శనివారం మధ్యాహ్నం పూణేలోని ముల్షి తహసీల్‌లో కుప్పకూలిందని అధికారులు తెలిపారు

By Medi Samrat  Published on  24 Aug 2024 9:15 PM IST
కుప్ప‌కూలిన హెలికాఫ్టర్.. ముంబై నుండి హైదరాబాద్ వస్తుండ‌గా..

ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న హెలికాప్టర్ శనివారం మధ్యాహ్నం పూణేలోని ముల్షి తహసీల్‌లో కుప్పకూలిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ముంబైలోని జుహు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా పూణె జిల్లాలోని పౌడ్ గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలిందని అధికారులు ధృవీకరించారు. ఘటన జరిగినప్పుడు AW 139 మోడల్ హెలికాప్టర్‌లో నలుగురు ప్రయాణికులు ఉన్నారు.

పూణే రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంకజ్ దేశ్‌ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన వారిని కెప్టెన్‌ ఆనంద్ గా గుర్తించారు. ఆయనను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ప్రయాణికులు అయిన డీర్ భాటియా, అమర్‌దీప్ సింగ్, ఎస్పీ రామ్‌ల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు నివేదించారు. హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా అనే ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందినది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story