ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఆయన ఏ అంశం మీద మాట్లాడబోతున్నారన్ని ఆసక్తికరంగా మారింది. ఇంత సడెన్ గా ఆయన ఏం చెప్పబోతున్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో అనేక కీలక అంశాలున్నాయి. అందులో దేనిపై ఆయన మాట్లాబోతున్నారన్నది సస్పెన్స్ గా మారింది.
హెచ్ 1 బీ వీసా అప్లికేషన్ ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మోడీ మాట్లాడతారా..? లేకపోతే ఇటీవలే జీఎస్టీ శ్లాబులను సర్కారు తగ్గించింది. దాని గురించి ఏదైనా మాట్లాడబోతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. గతంలో ఇలా సడెన్ మోడీ జాతీనుద్దేశించి ప్రసంగించిన సందర్భాల్లో చాలా కీలక నిర్ణయాలను ప్రకటించారు.